శ్రీలంకలో పోలీసుల, సైనికుల మధ్య వివాదం - MicTv.in - Telugu News
mictv telugu

శ్రీలంకలో పోలీసుల, సైనికుల మధ్య వివాదం

April 6, 2022

శ్రీలంక దేశంలో పరిస్థితులు రోజురోజుకు తీవ్ర ఉద్రిక్తలకు దారీ తీస్తున్నాయి. శ్రీలంక ప్రభుత్వం వ్యవహరిస్తున్నా తీరుపై ప్రజలు మండిపడుతున్నారు. భారీ ఆర్ధిక పతనం కారణంగా చవిచూస్తోన్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు తీవ్రంగా ఆందోళనలు, నిరసనలు చేస్తున్నారు.

అయితే, మంగళవారం పార్లమెంటు ఎదుట ప్రజలు నిరసనకు దిగారు. కర్ఫ్యూ అమల్లో ఉన్నప్పటికీ, వాటన్నింటినీ బేఖాతరు చేస్తూ.. ఆందోళనలు కొనసాగించారు.ఈ క్రమంలో వారిని అదుపు చేసేందుకు ఓ సైనిక బృందం మాస్కులు ధరించి, ఆ ప్రాంతానికి చేరుకుంది. అయితే, ఆ సైనిక బృందాన్ని ఆపేందుకు పోలీసులు ప్రయత్నించారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. చివరకు పరిస్థితి ఆందోళనకరంగా మారుతుండడంతో సైనికులు అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించారు.

దీంతో సైనికులు అక్కడినుంచి వెళ్లిపోతుండగా పోలీసులు వారి వెంటపడ్డారు. దీంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. అప్రమత్తమైన ఆర్మీ చీఫ్ శవేంద్ర సిల్వ ఘటనపై విచారణకు ఆదేశించారు. అయితే, సైనికులు తుపాకులతో అక్కడికి రావడం వల్లే పోలీసులు వారిని అడ్డుకున్నారని సామాజిక మాధ్యమాల్లో పలువురు పోస్టు పెట్టారు. ఆందోళనకారులపై సైన్యం దాడికి దిగితే పరిస్థితి మరింత విషమిస్తుందని భావించే పోలీసులు వారిని అడ్డుకున్నట్లు తెలుస్తోంది.