ముహుర్తాలు కుదరడంతో ఈ మధ్య దేశంలో చాలా పెళ్లిళ్లు జరుగుతున్నాయి. చాలా వరకు పెళ్లి కార్యక్రమాలు సంతోషంతో ముగుస్తుంటే కొన్ని మాత్రం భీబత్స గొడవలతో కేసుల వరకు వెళ్తున్నాయి. అయితే ఎక్కడైనా గొడవ వధూవరులు లేదా వారి తల్లిదండ్రుల మధ్య విభేదాలతో జరుగుతాయి. కానీ జార్ఖండ్లో జరిగిన గొడవ మాత్రం బంధువులతో మొదలైంది. వివరాలు.. గిరిదహ్ జిల్లాలోని మీర్జాగంజ్లో ఓ వివాహం జరుగుతోంది. వేడుకకు ఇరువర్గాల బంధుమిత్రులు హాజరయ్యారు. వివాహ తంతు అయ్యాక వధూవరులతో ఎవరు ముందు ఫోటో దిగాలనే అంశంపై ముందుగా ఇరువర్గాల మహిళల మధ్య గొడవ స్టార్టయింది. మేమంటే మేము అంటూ గొడవ పెరిగి పెద్దదయింది. దాంతో మగవాళ్లు రంగంలోకి దిగగా, వారు కూడా మాటామాటా పెరిగి కొట్టుకునేవరకు వెళ్లింది. అదింకా పెరిగి కర్రలతో, రాళ్లతో కొట్టుకొని తలకాయలు పగిలే వరకు వెళ్లింది.