‘అమ్మఒడి’ డబ్బుల కోసం ఘర్షణ.. భార్య ఆత్మహత్య - MicTv.in - Telugu News
mictv telugu

‘అమ్మఒడి’ డబ్బుల కోసం ఘర్షణ.. భార్య ఆత్మహత్య

January 14, 2020

Amma Odi.

ఏపీలో అమ్మఒడి పథకం ఓ కుటుంబంలో చిచ్చురేపింది. అమ్మఒడి డబ్బుల కోసం భార్యాభర్తలు ఇద్దరూ గొడవపడ్డారు. ఈ నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురైన భార్య ఆత్మహత్య చేసుకుంది. స్థానికంగా కలకలం రేపుతున్న ఈ ఘటన చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం నేతిగుండ్లపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. మంగళవారం ఉదయం అమ్మ ఒడి డబ్బుల కోసం భార్యాభర్తలిద్దరూ తగవులాడుకున్నారు. భర్త వైఖరిపై మనస్తాపం చెందిన భార్య ఆదిలక్ష్మి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని స్థానికులు తెలిపారు. వెంటనే ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదిలక్ష్మి మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

కాగా, అమ్మఒడి పథకం కింద 42లక్షలు ప్రభుత్వం మంజూరం చేసింది. దీంతో 12వేల 185 మంది తల్లులకు.. 81లక్షల 72వేల 222 మంది పిల్లలకు లబ్ది చేకూరింది. అర్హులైన తల్లుల అకౌంట్‌లో ప్రభుత్వం రూ.15వేలు జమ చేసింది. ప్రతి ఏటా రూ.15వేలు ఇస్తామని ముఖ్యమంత్రి జగన్ చెప్పారు. 1 నుంచి ఇంటర్ వరకు విద్యార్థులకు ఈ స్కీమ్ వర్తిస్తుంది.