ప్రవక్తపై వ్యాఖ్యల గొడవ..సంచలన వ్యాఖ్యలు చేసిన కంగన - Telugu News - Mic tv
mictv telugu

ప్రవక్తపై వ్యాఖ్యల గొడవ..సంచలన వ్యాఖ్యలు చేసిన కంగన

June 13, 2022

“నాకు చాలామంది ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారు. వారు మద్యం తాగుతారు, ధూమపానం చేస్తారు. వారిలో పెళ్లికి ముందే శృంగారంలో పాల్గొన్న వారు ఉన్నారు. వారు బురఖాలు ధరించరు. బూతులు మాట్లాడుతారు, పందిమాంసం తింటారు. వాళ్లు అలాంటి వాతావరణంలో పనిచేస్తుంటారు. వాళ్లు అన్ని నియమాలు పాటించరు కూడా. భారతదేశంలో ఉన్న స్వేచ్ఛాయుత వాతావరణ సౌందర్యం ఇదే. నుపుర్ ఒక్కదాన్నే నేరస్తురాలిగా చేయడం కాదు. ప్రతి ఒక్కరూ క్రిమినల్‌గా మారుతున్నారు” అని బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చారు.

ఇటీవలే బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ మహ్మద్ ప్రవక్తపై ఓ టీవీ ఛానెల్ చర్చ కార్యక్రమంలో వ్యాఖ్యలు చేసి, తీవ్ర విమర్శలకు గురైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బాలీవుడ్ అందాల తార కంగానా మరోసారి నుపూర్ శర్మకు మద్దతు పలికింది. నుపూర్ శర్మ చేసిన వ్యాఖల్లో తప్పేముంది అంటూ తీవ్రంగా మండిపడింది. ఈ ఘటన విషయంలో నుపుర్ ఒక్కదాన్నే నేరస్తురాలిగా చేయడం సరైంది కాదు. ప్రతి ఒక్కరూ క్రిమినల్‌గా మారుతున్నారని ఆమె అన్నారు.

హిమాచల్ ప్రదేశ్, భంబ్లా పల్లెటూరిలో జన్మించిన కంగనా రనౌత్, 2006లో గాంగ్ స్టర్ సినిమాతో తెరంగేట్రం చేశారు. అప్పటి నుంచి నేటివరకు పలు సినిమాల్లో నటించి ఎన్నో అవార్డులు గెలుపొందారు. అయితే, బాలీవుడ్‌లో కంగనా రనౌత్ అంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడే వ్యక్తిగా పేరుగాంచారు. పలు విషయాలలో వ్యాఖ్యలు చేయడంతో వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్‌గా కంగనా రనౌత్ నిలిచారు. ఈ క్రమంలో నుపూర్ శర్మ చేసిన వ్యాఖ్యల విషయంలో కంగానా మరోసారి తీవ్రంగా మండిపడుతూ, ఆమెకు మద్దతు ఇచ్చారు.