‘మహ్మద్ ప్రవక్తపై నేను చేసిన వ్యాఖ్యల పట్ల క్షమాపణలు చెప్తున్నాను. ఏ ఒక్కరి మత విశ్వాసాలను దెబ్బతీయాలన్న ఉద్దేశంతో నేను ఆ వ్యాఖ్యలు చేయలేదు. దయచేసి నా చిరునామాను బహిర్గతం చేయకండి. నా కుటుంబ భద్రతకు ముప్పువాటిల్లే అవకాశం ఉంది.” అని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ అన్నారు.
ఇటీవలే ఓ టీవీ చానల్ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న ఆమె.. ‘గత చాలా రోజులుగా మా మహాదేవ్ శివుడిని అవమానిస్తూ, అగౌరవపరుస్తుండటంతో నేను టీవీ చర్చలకు హాజరవుతున్నాను. జ్ఞానవాపి మసీదు లభించింది శివలింగం కాదు. ఫౌంటెన్ అని ఎగతాళిగా చెబుతున్నారు. శివలింగాన్ని ఢిల్లీలోని రోడ్డు పక్కన ఉన్న గుర్తులు, స్తంభాలతో పోల్చుతూ వెక్కిరిస్తున్నారు. మా శివుడిని ఇలా నిరంతరంగా అగౌరవపరచడాన్ని నేను సహించలేకపోయాను’ అని నేను కొన్ని విషయాలు చెప్పాను అని నుపుర్ శర్మ వివరణ ఇచ్చారు.
ఈ క్రమంలో ఆమె చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. బీజేపీ పార్టీపై ప్రతిపక్షాలు తీవ్రమైన విమర్శలు గుప్పిస్తున్నాయి. దాంతో బీజేపీ పార్టీ నుపుర్ శర్మను జాతీయ అధికార ప్రతినిధి పదవి నుంచి తప్పిస్తూ, పార్టీ ప్రాథమిక సభ్యత్వం కూడా రద్దు చేసింది. దాంతో నుపుర్ శర్మ మహ్మద్ ప్రవక్తను అవమానించిందని, ఆమెను త్వరలోనే చంపేస్తామని కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఆమెను తెగ బెదిరిస్తున్నారని సోమవారం ఆమె ఢిల్లీ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మరోపక్క నుపుర్ శర్మతోపాటు బీజేపీ ఢిల్లీ మీడియా ఇన్చార్జిగా వ్యవహరించిన నవీన్ జిందాల్ కూడా మహ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలకు మూల్యాన్ని చెల్లించిన వెంటనే నవీన్ జిందాల్‌ను కూడా బీజేపీ సస్పెండ్ చేసింది. నుపుర్, నవీన్ జిందాల్ వ్యాఖ్యల ఫలితంగా ముస్లిం దేశాలు సౌదీ అరేబియా, ఖతార్, బహ్రెయిన్, ఇరాన్ మండిపడుతున్నాయి. మహ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఇటువంటి సమయంలో దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలు బీజేపీపై విరుచుకుపడుతున్నాయి. ఈ క్రమంలో బీజేపీ పార్టీ ఇద్దరిని పార్టీ అధికారుల ఉంచి తొలగిస్తూ, అధికారిక ప్రకటన చేశారు.