వలస కూలీలపై పొగబాంబులు.. సూరత్‌లో టెన్షన్ - MicTv.in - Telugu News
mictv telugu

వలస కూలీలపై పొగబాంబులు.. సూరత్‌లో టెన్షన్

May 4, 2020

Conflicts between migrant laborers and police in surat

దేశంలో కొనసాగుతోన్న సుదీర్ఘ లాక్ డౌన్ చివరకు కార్మికులకు పోలీసులకు మధ్య గొడవలు జరిగేలా చేస్తుంది. ఈరోజు గుజరాత్ లోని సూరత్ లో జరిగిన సంఘటనే ఇందుకు నిదర్శనం. సూరత్ లోని పరిశ్రమల్లో పనిచేస్తున్న వలస కార్మికులు తమ స్వస్థలాలకు వెళ్లడానికి ప్రయత్నం చేస్తున్నారు. వేల సంఖ్యలో ఉన్న కార్మికులను ఒకేసారి స్వస్థలాలకు తరలించడం మంచిది కాదని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. 

దశల వారీగా వారిని స్వస్థలాలకు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో తమకు సరైన తిండి దొరకడం లేదని, డబ్బులు కూడా లేవని తమ దారి తమను చూసుకోనిస్తే ఎలాగోలా తమ స్వస్థలాలకు చేరిపోతామంటూ కార్మికులు ఆందోళనకు దిగారు. దీంతో వారిని నియంత్రించడానికి ప్రయత్నించిన పోలీసులపై వలస కార్మికులు రాళ్ళ దాడికి దిగారు. దాంతో పోలీసులకు వారికి మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ చోటు చేసుకుంది. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసి తమను స్వస్థలాలకు పంపేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటోందని వలస కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.