టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి మొహాలి వేదికగా శ్రీలంకతో తన వందో టెస్టు మ్యాచ్ ఆడుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మాజీ కోచ్ రవిశాస్త్రి వినూత్న రీతిలో శుభాకాంక్షలు చెప్పాడు. ‘వందో టెస్టు సెలబ్రేట్ చేసుకోవడానికి 100 కారణాలు. ఇదోక అద్భుతమైన ప్రయాణం. కోహ్లి ఆడిన ఇన్ని మ్యాచ్‌లో జట్టుతో కలిసి ప్రత్యక్షంగా చూసినవి చాలా మ్యాలు ఉన్నాయి. ఛాంపియన్.. ఈ కీలకమైన వందో టెస్టును కూడా ఆస్వాదించు’ అని మాజీ కోచ్ ట్వీట్ చేశాడు. అంతేకాకుండా ‘ట్రేసర్ బుల్లెట్ షాట్ అంటూ తరచూ తనదైన శైలిలో వ్యాఖ్యానం చేసేవాడు. ఆ డైలాగ్‌ను ఎవరైనా తనలా చెప్పగలరా అని అడిగాడు. దీంతో కోహ్లి స్పందిస్తూ ‘రవిభాయ్ మీలా చెప్పడం ఎవరివల్లా కాదు. కానీ, నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను’ అంటూ కోహ్లి.. శాస్త్రి చెప్పిన డైలాగ్ ఆయన శైలిలో చెప్పాడు. దీంతో ఆ ట్రేసర్ బుల్లెట్ ఇప్పుడు అభిమానులను అలరిస్తోంది.
100 reasons to celebrate Test match No. 100. Its been a fabulous century. Great to watch a lot of it ringside. Enjoy this one champ through the covers…🤗 @imVkohli #VK100 pic.twitter.com/iGeoxyrEzQ
— Ravi Shastri (@RaviShastriOfc) March 3, 2022
మరోపక్క ఈ అరుదైన ఘనతను సాధించిన క్లోహి.. 11వ అంతర్జాతీయ ఆటగాడిగానే కాకుండా టీమ్ ఇండియా తరపున 12వ క్రికెటర్‌గా నిలిచాడు. ఈ సందర్భంగా భారత జట్టు ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ అతడికి శుభాకాంక్షలు తెలుపుతూ ‘ప్రత్యేకమైన జ్ఞాపికతో పాటు వందో టెస్టు క్యాప్’ అందజేశాడు. మ్యాచ్ ప్రారంభానికి ముందు జరిగిన ఈ వేడుకలో కోహ్లి సతీమణి అనుష్క శర్మ కూడా పాల్గొన్నారు.
What a moment to commemorate his 100th Test appearance in whites 🙌🏻
Words of appreciation from the Head Coach Rahul Dravid and words of gratitude from @imVkohli👏🏻#VK100 | #INDvSL | @Paytm pic.twitter.com/zfX0ZIirdz
— BCCI (@BCCI) March 4, 2022