కంగ్రాట్స్ మధులతా!.. మహమూద్‌ అలీ - MicTv.in - Telugu News
mictv telugu

కంగ్రాట్స్ మధులతా!.. మహమూద్‌ అలీ

March 8, 2022

28

ఉమెన్స్‌ డే సందర్భంగా తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి మహమూద్‌ అలీ కీలక నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సిటీ పోలీసు విభాగంలో ఓ మహిళ ఇన్‌స్పెక్టర్‌ను శాంతి భద్రతల విభాగం కింద పోలీసు స్టేషన్‌కు హౌస్‌ ఆఫీసర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మంగళవారం మహమూద్‌ అలీ, ప్రస్తుత హైద‌రాబాద్‌ నగర పోలీసు క‌మిష‌న‌ర్ సీవీ ఆనంద్ ఆధ్వర్యంలో ప్రకటన చేశారు. మరి ఆ మహిళ ఇన్‌స్పెక్టర్ ఎవరు? ఏ స్టేషన్‌లో విధులు నిర్వహించబోతున్నారు? అనే వివరాలను తెలుసుకుందామా..

హైద‌రాబాద్‌లోని లాలాగూడ లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ (సర్కిల్ ఇన్‌స్పెక్టర్)గా మహిళా అధికారి మధులత ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ నగర పోలీసు చరిత్రలో మహిళా సీఐ ఎస్‌హెచ్‌ఓగా బాధ్యతలు చేపట్ట‌డం ఇదే మొట్ట‌మొద‌టి సారి. మధులతకు ఎన్‌హెచ్‌ఓగా బాధ్యతలు అప్పగించిన అనంతరం హూంమంత్రి, సీవీ ఆనంద్‌లు కంగ్రాట్స్ అంటూ అభినంద‌న‌లు తెలిపారు. మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా ఆమె ఈ బాధ్య‌త‌లు స్వీక‌రించ‌డం గ‌మ‌నార్హం. తెలంగాణ‌ రాజధానిలోని మూడు కమిషనరేట్లలో ఇప్పటి వరకు ఏ మ‌హిళా అధికారిణీ శాంతిభద్రతల విభాగ పోలీస్ స్టేష‌న్‌కు ఎస్‌హెచ్‌ఓగా లేరు. ఈ నేపథ్యంలో మధులతను అధికారిణీగా నియమించడం సంచలనంగా మారింది.