కంగ్రాట్స్ వెంకయ్య గారు..! - MicTv.in - Telugu News
mictv telugu

కంగ్రాట్స్ వెంకయ్య గారు..!

August 5, 2017

అందరూ అనుకున్నట్టే.. ఉప రాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు ఎన్నికయ్యారు. ఆయనకు 516 ఓట్లు రాగా.. యూపిఏ ఉపరాష్ట్రపతి అభ్యర్ధి గోపాలకృష్ణ గాంధీకి 244 ఓట్లు వచ్చాయి. 272 ఓట్ల తేడాతో గెలిచారు వెంకయ్య. 15వ ఉపరాష్ట్రపతిగా ఆగస్ట్ 11న ప్రమాణం చేయనున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఐదు వరకూ పార్లమెంట్ ఆవరణలో ఓటింగ్ జరిగింది. పార్లమెంట్ ఉభయ సభల సభ్యులు ఓటేశారు. ఒక రాజ్యసభ సభ్యుడే రాజ్యసభ చైర్మెన్ కావడం ఇదే తొలిసారి. వెంకయ్య గెలుపుతో ఎన్డీయే పక్షాల్లో ఆనందం వెల్లువిరుస్తోంది.