కంగ్రాట్స్.. అందరికి మంచి రోజులు వచ్చాయి: కేటీఆర్ - MicTv.in - Telugu News
mictv telugu

కంగ్రాట్స్.. అందరికి మంచి రోజులు వచ్చాయి: కేటీఆర్

July 6, 2022

తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ కాసేపటిక్రితమే సామాజిక మాధ్యమాల్లో ఓ ట్విట్ చేశారు. ”కంగ్రాట్స్ అందరికి మంచి రోజులు వచ్చేశాయ్‌. వంటింటి గ్యాస్‌ సిలిండర్‌ ధరను కేంద్రం మరో రూ.50 పెంచేసింది. సిలిండర్‌ ధర పెంచి మహిళలకు ప్రధాని మోదీ కానుకగా ఇచ్చేశారు” అని కేంద్రం పెంచిన వంటగ్యాస్‌ సిలిండర్‌ ధరపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

 

చమురు సంస్థలు నేటి నుంచి గృహావసరాల కోసం వినియోగించే 14 కేజీల సిలిండర్‌పై పెంచిన ధర రూ.50 అమల్లోకి వచ్చిందని ఓ ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. దీంతో ఢిల్లీలో వంటగ్యాస్ సిలిండర్ ధర రూ. 1053కి చేరుకోగా, హైదారబాద్‌లో రూ.1055గా ఉన్న గ్యాస్‌ బండ ధర రూ.1105కు చేరింది. దీంతో పాటు ఐదు కేజీల డొమెస్టిక్‌ సిలిండర్‌పై మరో రూ.18 భారం మోపింది. పెరిగిన ధరలు వెంటనే అమల్లోకి వస్తాయని ప్రకటించడంతో కేటీఆర్ ట్విటర్ వేదికగా స్పందిస్తూ, కేంద్రంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.