Congress CM ashok gehloth drank Tirtha without removing his mask
mictv telugu

మాస్క్ తీయకుండా తీర్థం తాగిన కాంగ్రెస్ సీఎం.. వీడియోపై ట్రోలింగ్

September 6, 2022

Congress CM ashok gehloth drank Tirtha without removing his mask

రాజస్థాన్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్ సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు గురవుతున్నారు. ఓ గుడిలోకి దర్శనం కోసం వెళ్లిన అశోక్.. ముఖానికి మాస్క్ వేసుకోగా, పూజారి ఇచ్చిన తీర్ధాన్ని మాస్క్ తీయకుండానే తాగేశారు. ఈ వీడియో వైరల్ అవడంతో అదెలా సాధ్యమంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.

వివరాల్లోకెళితే.. అశోక్ గెహ్లాత్ ఇటీవల జైసల్మేర్‌లోని ఓ ఆలయానికి వెళ్లారు. కరోనాను అరికట్టే నేపథ్యంలో మాస్క్ వేసుకొని మరీ వెళ్లారు. అక్కడ దేవుని విగ్రహానికి నమస్కరించి అనంతరం పూజారి ఇచ్చిన తీర్ధాన్ని మాస్క్ తీయకుండానే తాగేశారు. దీంతో సోషల్ మీడియాలో ముఖ్యమంత్రిపై వ్యంగాస్త్రాలు సంధిస్తున్నారు. ఇప్పటివరకు ఈ వీడియోకు 50 వేల మంది చూడగా, పలు ఎమోజీలతో నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. మాస్క్‌తో నీళ్లు ఎలా తాగాలో సీఎంని చూసి నేర్చుకోండి, అలా ఎలా నీళ్లు తాగారు, పాపం మర్చిపోయారేమో వంటి కామెంట్లు చేస్తున్నారు. కాగా, తినడం, తాగడం వంటివి చేసినప్పుడు మాస్క్ తీయడం తప్పనిసరి. అయితే ఆ మధ్య తినడం, తాగడానికి కూడా వీలుగా ఉండేలా కొన్ని మాస్కులు మార్కెట్లో వచ్చాయి.