కరోనాకు కాంగ్రెస్ కౌన్సిలర్ చిట్కా.. రమ్ తాగి గుడ్లు తినాలట - MicTv.in - Telugu News
mictv telugu

కరోనాకు కాంగ్రెస్ కౌన్సిలర్ చిట్కా.. రమ్ తాగి గుడ్లు తినాలట

July 18, 2020

Congress Councillor Corona Tips

మందులేని మహమ్మారి యావత్ ప్రపంచాన్నే వణికిస్తోంది. దీన్ని కట్టడి చేసేందుకు వ్యాక్సిన్ లేకపోవడంతో శాస్త్రవేత్తలు తలమునకలయ్యారు. అయితే కొన్ని చిట్కాలను పాటించి వైరస్ వ్యాప్తిని తగ్గించుకునే ప్రయత్నాలు చాలా మంది చేస్తున్నారు. ఈ క్రమంలో మంగళూరుకు చెందిన కాంగ్రెస్ కౌన్సిలర్ సంచలన వీడియో విడుదల చేశారు. రమ్ తాగి, కోడిగుడ్లు తింటే వైరస్ పోతుందని చెబుతూ చిట్కా చెప్పాడు. ఈ వీడియో వైరల్ కావడంతో ఆయన మాటలు విన్న నెటిజన్లు షాక్ అవుతున్నారు.  

మంగళూరులోని ఉల్లాల్ సీఎంసీకి చెందిన కాంగ్రెస్ కౌన్సిలర్ రవిచంద్రగట్టి సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశాడు. చేతిలో రమ్ బాటిల్ పట్టుకొని ఊగిపోతూ.. ఆయన స్వయంగా కరోనా చిట్కాలు చెప్పాడు. ‘90 ఎంఎల్ రమ్‌లో టీ స్పూన్ మిరియలు కలుపుకొని తాగండి. ఆ తర్వాతఫ్రై చేసిన రెండు కోడి గుడ్లు తినండి. నేను దీన్ని ప్రయత్నించాను. దీన్ని నేను ఒక రాజకీయ నాయకుడిగా సూచించడం లేదు’ అంటూ చెప్పుకొచ్చాడు. కాగా రవిచంద్ర కౌన్సిలర్ మాత్రమే కాక, సామాజిక కార్యకర్తగాను పనిచేస్తున్నాడు. అలాంటి వ్యక్తి ఈ వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. ఈ వ్యవహారంపై పార్టీ పెద్దలు కూడా దృష్టిసారించారని సమాచారం.