మీ ట్వీట్ వారు చదవలేరు..ప్రధానికి కాంగ్రెస్ కౌంటర్ - MicTv.in - Telugu News
mictv telugu

మీ ట్వీట్ వారు చదవలేరు..ప్రధానికి కాంగ్రెస్ కౌంటర్

December 12, 2019

Congress 0277

పౌరసత్వ సవరణ బిల్లుపై ఈశాన్య రాష్ట్రాలు భగ్గుమన్నాయి. బిల్లును నిరసిస్తూ ప్రజలు రోడ్డుపైకి వచ్చి నిరసనలు, ఆందోళనలు చేపట్టారు. వారికి భరోసా ఇచ్చేందుకు ప్రధాని ఓ ట్వీట్ చేశారు. మీకు అండగా నేను ఉన్నా భయపడొద్దంటూ ట్వీట్ చేశారు. దీనికి కాంగ్రెస్ పార్టీ అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చింది. అస్సాం ప్రజలు ఎవరూ మీరు పోస్టు చేసిన మెసేజ్ చదవలేరంటూ ఆ పార్టీ అధికారిక ట్విట్టర్‌లో పేర్కొన్నారు. 

‘అసోం సోదర, సోదరీమణులు మీరు ఇస్తున్న భరోసా వారు చదవలేరు. ఎందుకంటే వారికి ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. బహుశా ఈ విషయాన్ని మీరు మరిచిపోయి ఉండవచ్చు’ అంటూ ఎద్దేవా చేశారు. కాగా పౌరసత్వ బిల్లు ఆమోదం పొందిన తర్వాత అసోంలో ఆంక్షలు విధించారు. అక్కడ ఇంటర్నెట్ సేవలను కూడా నిలిపివేశారు. ఇప్పటికే అక్కడి ప్రజలు ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేశారు.