సికింద్రాబాద్ కాల్పుల్లో మరణించిన దామోదర రాకేశ్ అంతిమ యాత్ర విమర్శలకు దారి తీసింది. అంతిమ యాత్రలో టీఆర్ఎస్ జెండాలు కనిపించడంపై టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘టీఆర్ఎస్ నాయకులు మనుషులేనా? ఆర్మీ అభ్యర్ధి మరణాన్ని రాజకీయాలకు వాడుకుంటారా? అంటూ మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం రాకేశ్ ఊపిరి తీస్తే, టీఆర్ఎస్ రాకేశ్ ఆత్మను చంపేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరుడి మృతదేహంపై ఉండాల్సింది త్రివర్ణ పతాకమే కానీ, మీ ఫాసిస్టు జెండాలు కాదంటూ కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చేసింది. శవాలను రాబందులను పీక్కుతినడం టీఆర్ఎస్ నుంచే నేర్చుకున్నాయోమోనంటూ ఎద్దేవా చేసింది. ఇలా డబ్బులిచ్చి జనాలను తరలించి అంతిమ యాత్ర చేయడం సిగ్గుచేటని విమర్శించింది.