రామ మందిరం నిర్మాణానికి మేమూ ఓకే: కాంగ్రెస్ - MicTv.in - Telugu News
mictv telugu

రామ మందిరం నిర్మాణానికి మేమూ ఓకే: కాంగ్రెస్

November 9, 2019

దశాబ్ధాలుగా నలుగుతూ వస్తున్న అయోధ్య భూ వివాదానికి పరిష్కారం లభించింది. దేశ సర్వోన్నత న్యాయమస్థానం శనివారం తీర్పు వెల్లడించింది. ఆ భూమి రాంలాలాకే చెందుతుందని తేల్చి చెప్పింది. మసీదు నిర్మాణం కోసం మరో చోట స్థలం కేటాయించాలని సూచించింది. ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన ఏకగ్రీవ తీర్పును అన్ని వర్గాలు స్వాగతించాయి. ఇది ఎవరి విజయం కాదని, న్యాయస్థానాలపై మనకు ఉన్న నమ్మకం అంటూ పలువురు పేర్కొంటున్నారు. ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా ఈ తీర్పుపై స్పందించింది. 

సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును తమ పార్టీ స్వాగతిస్తోందని కాంగ్రెస్ సీనియర్ లీడర్ రణ్‌దీప్ సుర్జేవాలా తెలిపారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం తాము అనుకూలంగా ఉన్నామని అన్నారు. చాలా రోజులుగా నలుగుతూ వస్తున్న అంశానికి పరిష్కారం దొరకడం సంతోషమని వ్యాఖ్యానించారు. ఈ  సందర్భంగా బీజేపీపై ఆయన విమర్శలు సందించారు. సుప్రీం తీర్పు రామ మందిర నిర్మాణం కోసం ద్వారాలు తెరవడంతో బీజేపీ రాజకీయంగా వాడుకునేందుకు ద్వారాలు మూసుకుపోయాయని అన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఈ అంశంపై టీవీ షోల్లో డిబేట్లలో పాల్గొనకూడదని నిర్ణయించింది. అది సమిష్టి విజయంగా భావించాలని ఆ పార్టీ ప్రజలను కోరింది. 

తీర్పు నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. సోషల్ మీడియాలోనూ వివాదస్పద వ్యాఖ్యలు చేయకుండా ముందు జాగ్రత్తగా వాటిపై నిఘా ఉంచారు. ప్రజలంతా సంయమనంతో మెలగాలని పలువురు కోరుతున్నారు. ఇటు ముస్లిం మత పెద్దలు కూడా కోర్టు తీర్పునున గౌరవిస్తున్నట్టు వెల్లడించారు.