కర్ణాటకలో గెలిచేది మళ్లీ కాంగ్రెస్సే! - MicTv.in - Telugu News
mictv telugu

కర్ణాటకలో గెలిచేది మళ్లీ కాంగ్రెస్సే!

March 26, 2018

ఉత్కంఠ రేపుతున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలపై సర్వేలు వెలువుడుతున్నాయి. ఎన్నికల్లో అధికార పక్షమైన కాంగ్రెస్సే మళ్లీ గెలుస్తుందని  సీఫోర్ సంస్థ వెల్లడించింది. 2013 ఎన్నికల సమయంలోనూ ఈ సంస్థే కాంగ్రెస్ విజయాన్ని అంచనా వేసింది.

సీఫోర్ తాజా సర్వే ప్రకారం.. మొత్తం 224సీట్లున్న కర్ణాటక అసెంబ్లీలో 126స్థానాలను సులభంగా దక్కించుకుంటుంది. . కాంగ్రస్ 46శాతం ఓటింగ్‌తో కాంగ్రెస్ విజయ పతాకాన్ని ఎగరేస్తుంది. బీజేపీకి 31శాతం ఓట్లు, 70 సీట్లు వస్తాయి. గత ఎన్నికల్లో కాషాయ దళానికి 40 మాత్రమే దక్కాయి. తాజా సర్వేలో భాగంగా 154 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 22357 మందిని ప్రశ్నించారు.

సీఫోర్ గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌కు 120 స్థానాలు వస్తాయని అంచనా వేయగా 122 వచ్చాయి. దక్షిణాదిలో పాగా వేయడానికి యత్నిస్తున్న బీజేపీకి తాజా సర్వే ఫలితాలు జీర్ణించుకోలేనివే. దక్షిణాల్లో ఒక్క కర్ణాటకలో మాత్రమే బీజేపికి పట్టుంది. అక్కడ అధికారంలోకి వచ్చిన యడ్యూరప్ప వంటి నేతలపై అవినీతి ఆరోపణలు ఆ పార్టీని అధికారానికి దూరం చేశాయి.