Congress leader Jairam Ramesh happy on munugodu bjp candidate komatireddy Rajagopal reddy defeat
mictv telugu

కోమటిరెడ్డి ఓడిపోవడం సంతోషం కలిగించింది.. కాంగ్రెస్

November 7, 2022

కాంగ్రెస్‌కు రాజీనామా చేసి మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీపడిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎక్కడ తప్పు జరిగిందోనని కమల శ్రేణులతో మంతనాలు జరుపుతున్నారు. కాంగ్రెస్ ఎంపీ, సోదరుడు వెంకట్ రెడ్డి తనకు అండగా నిలబడినా ఫలితం లేకపోయిందే అని వాపోతున్నారు. మరోపక్క రాజగోపాల్ రెడ్డి ఓడిపోవడంతో కాంగ్రెస్ లోలోపలే కాదు, బయటికీ కూడా సంబరం చేసుకుంటోంది. ఆయన ఓటమి తనకు సంతోషం కలిగించిందని సీనియర్ నేత జైరాం రమేశ్ అన్నారు. ‘‘అక్కడ గెలిచింది మందు, డబ్బే. మేం ఓడిపోయి ఉండొచ్చు. కానీ ఇలాంటి ఉప ఎన్నికలు కాంగ్రెస్ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేవు. ఇద్దరు కోటీశ్వరులపై మా అభ్యర్థి పాల్వాయి స్రవంతి బాగా పోరాడారు’’ అని కొనియాడారు.

కాగా, బీజేపీని గెలిపించాలని, కాంగ్రెస్ ఓడిపోతుందనని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కోమటరెడ్డి వెంకట్ రెడ్డికి రెండుసార్లు నోటీసులు పంపినా ఆయన జవాబు ఇవ్వలేదని జైరాం రమేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘వివరణ ఇస్తే పరిశీలిస్తాం. తర్వాత చర్యలు తీసుకుంటాం. అక్టోబర్ 22న, నవంబరు 4న నోటీసులు ఇచ్చాం. ఆయన స్పందించడం లేదు. మా పార్టీకి కొన్ని పద్ధతులు ఉంటాయి, ఇది రైల్వే ప్లాట్ ఫాం కాదు. హద్దు దాటితే చర్యలు తప్పవు’’ అని అన్నారు.