Congress leader Parsadilal Meena compared Rahul Gandhi to sri Ram
mictv telugu

రాహుల్ గాంధీకి రాముడితో పోలిక.. ఎలాగో వివరించిన కాంగ్రెస్ నేత

October 18, 2022

Congress leader Parsadilal Meena compared Rahul Gandhi to sri Ram

భారత్ జోడో యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఆ పార్టీ నేత శ్రీరాముడితో పోల్చాడు. రాజస్థాన్ మంత్రి పర్సదిలాల్ మీనా సోమవారం ఈ పోలిక తెచ్చారు. రాముడు అయోధ్య నుంచి లంక వరకు నడిచాడని తమ నాయకుడు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నడుస్తున్నాడని అన్నారు.

దీనిపై మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే స్పందిస్తూ.. ఇద్దరి పేర్లు ‘ఆర్’ తో ప్రారంభమవడం కాకతాళీయమని తెలిపారు. అయితే ఇద్దరి మధ్య పోలిక తేవడం లేదని, ఆయన భగవంతుడు, ఈయన మనిషి అని స్పష్టం చేశారు. బీజేపీలా తాము తమ నాయకులను దేవుళ్లతో పోల్చబోమని పేర్కొన్నారు. దేశాన్ని ఏకం చేసేందుకు శంకరాచార్య కూడా పాదయాత్ర చేశారని, ఇప్పుడు అదే లక్ష్యంతో రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తున్నారని వివరించారు. ఈ సంగతి స్పష్టంగా కళ్లముందు కనపడుతుందని, ఎవరైనా చూడవచ్చని అభిప్రాయపడ్డారు. కాగా, సోమవారం విరామం ఇచ్చిన పాదయాత్ర.. మంగళవారం ఏపీలో ప్రవేశించింది. అనంతరం తెలంగాణ, మహారాష్ట్ర గుండా సాగుతుంది.