పొన్నాలకు తప్పిన ప్రాణాపాయం.. కారు ధ్వంసం - MicTv.in - Telugu News
mictv telugu

పొన్నాలకు తప్పిన ప్రాణాపాయం.. కారు ధ్వంసం

October 28, 2019

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యకు త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారును ఈ రోజు రాత్రి సినిమా షూటింగ్ వాహనం ఒకటి ముందు నుంచి ఢీకొట్టింది. జూబ్లీహిల్స్‌ రోడ్ నంబర్ 45 సిగ్నల్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఆ సమయంలో కారులో పొన్నాల, ఆయన మనవడు ఉన్నారు. డ్రైవర్ సహా ముగ్గురూ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదం ధాటికి పొన్నాల కారు ముందు భాగం దెబ్బతింది. కాంగ్రెస్ నేతలు పొన్నాలకు ఫోన్ చేసి విషయం తెలుసుకుంటున్నారు. 

ponnal lakshmaiah.