ప్రియాంకా గాంధీ అరెస్ట్.. రాహుల్ ఆగ్రహం  - MicTv.in - Telugu News
mictv telugu

ప్రియాంకా గాంధీ అరెస్ట్.. రాహుల్ ఆగ్రహం 

July 19, 2019

కాల్పుల్లో చనిపోయిన వారి గిరిజనుల కుటుంబాలకు పరామర్శించడానికి వెళ్లిన కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంకా గాంధీని ఉత్తర ప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. సోన్‌భద్ర జిల్లాలో భూవివాదంలో ఇటీవల 10 రైతులు చనిపోవడంతో వారి కుటుంబాలను పరామర్శించడానికి వెళ్తుండగా నారాయణ్‌పూర్‌ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఆమె, కాంగ్రెస్ కార్యకర్తలు ధర్నాకు దిగారు. అయితే మీరు వెళ్తే ఉద్రిక్తత మరింత పెరుగుతుందంటూ పోలీసులు వారిని అడ్డుకున్నారు. 

అందరమూ వెళ్లబోమని, నలుగురం మాత్రమే వెళ్తామని ప్రియాంక చెప్పినా పట్టించుకోలేదు. వారిని చునార్‌ గెస్ట్ హౌస్‌కు తరలించారు. దీనిపై ప్రియాంక సోదరుడు, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజనుల పరామర్శించడానికి నేరమా? అని ప్రశ్నించారు. యోగి బీజేపీ ప్రభుత్వం అభద్రతా భావంతో ఇలాంటి అక్రమాలకు పాల్పడుతోందని మండిపడ్డారు.