మోదీపై ప్రియాంకా గాంధీ పోటీ.. భర్త వెల్లడి - MicTv.in - Telugu News
mictv telugu

 మోదీపై ప్రియాంకా గాంధీ పోటీ.. భర్త వెల్లడి

April 16, 2019

కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ సోదరి ప్రియాంకా గాంధీ ఎన్నికల ప్రచారం చురుగ్గా పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ప్రధాని మోదీపై ఆమె తీవ్ర విమర్శలు కూడా సంధిస్తున్నారు. ఆయన ప్రధాని అయ్యాక వారణాసి ముఖం చూడలేదని విమర్శిస్తున్నారు. పార్టీ ఆదేశిస్తే తాను ఎక్కడి నుంచైనా పోటీకి సిద్ధమని ప్రకటిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఆమె భర్త రాబర్ట్ వాద్రా సంచలన ప్రకటన చేశారు. మోదీ లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి నుంచి పోటీ చేయడానికి ప్రియాంక సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. ప్రియాంక పోటీపై ఆమె కుటుంబ సభ్యుల్లో ఒకరు ప్రకటన చేయడం ఇదే తొలిసారి. ‘వారణాసి నుంచి పోటీ చేయడానికి ఆమె అంగీకరించారని, దీనిపై పార్టీ అధిష్టానం తుది నిర్ణయం తీసుకుంటుందని వాద్రా మీడియాకు చెప్పారు. ప్రియాంక.. సోనియాగాంధీ నియోజకవర్గమైన రాయబరేలి నుంచి పోటీ చేయవచ్చు కదా అని  విలేకర్లు అడగ్గా.. ‘వారణాసి నుంచి ఎందుకు చేయకూడదు?’ అని బదులిచ్చారు.