‘షటప్ ఇండియా’గా మార్చకండి - MicTv.in - Telugu News
mictv telugu

‘షటప్ ఇండియా’గా మార్చకండి

October 26, 2017

కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పారిశ్రామిక ప్రగతి, స్వదేశీ వస్తూత్పుల తయారీ కోసం చేపట్టిన స్టార్టప్ ఇండియాలో ప్రతిష్టంభనపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్రంగా మండిపడ్డారు. ‘స్టార్టప్ ఇండియా దేశానికి మంచిదే.

కానీ దాన్న చివరకు షటప్ ఇండియాగా మాత్రం మార్చకండి’ అని గురువారం ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో అన్నారు. బీజేపీ ప్రభుత్వాన్ని ప్రజలు విశ్వసించడం లేదని, దేశంలో ఆర్థిక వృద్ధి బాగా కుంటుపడిందని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చి మూడున్నరేళ్లయినా హామీలను పది శాతం కూడా అమలు చేయడం లేదన్నారు. అయినా ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ రోజూ టీవీ చానళ్ల మైకులు ముందుకొస్తూ.. దేశంలో అంతా బాగుందంటూ పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని విమర్శించారు. నల్లధనంపై మోదీ సర్కారు శక్తిమంతంగా పోరాడం లేదని, ఏవో పైపై చర్యలతో ఫలితం రాదని స్పష్టం చేశారు. ‘నల్లధనమంతా నగదు రూపంలో లేదు. నగదు అంతా నల్లధనం’ కాదు అని పేర్కొన్నారు.