ప్రగతి భవన్ ముట్టడి..రేవంత్ రెడ్డి అరెస్ట్ - MicTv.in - Telugu News
mictv telugu

ప్రగతి భవన్ ముట్టడి..రేవంత్ రెడ్డి అరెస్ట్

October 21, 2019

తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె 17వ రోజుకు చేరింది. కార్మికుల సమ్మెకు సంఘీభావం తెలుపుతున్న కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రగతి భవన్ ముట్టడికి పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ప్రగతి భవన్ ముట్టడికి వచ్చిన కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. బైక్ పై వచ్చిన ఆయనను ఆపేసి, అదుపులోకి తీసుకున్నారు. బలవంతంగా పోలీసు వాహనంలో తరలించారు. రేవంత్ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 

Posted by Satyavathi Satya on Monday, 21 October 2019

 

ఆర్టీసీ కార్మికుల జీవితాలతో ఆడుకుంటున్న కేసీఆర్ నశించాలి అంటూ నినదించారు. ఆర్టీసీ కార్మికులతో వెంటనే చర్చలు జరపాలని, ప్రాణాలు అర్పించిన కార్మికుల కుటుంబాలకు తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రేపు కేసీఆర్ ప్రగతి భవన్ గోడలను 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు బద్దలు కొట్టడం ఖాయమని అన్నారు.

Posted by Satyavathi Satya on Monday, 21 October 2019