Congress leader Shashi Tharoor praised ex-Pakistan president Musharraf, netizens expressed outrage
mictv telugu

ముషారఫ్‎ను ప్రశంసిస్తూ..శశిథరూర్ ట్వీట్..!!

February 5, 2023

Congress leader Shashi Tharoor praised ex-Pakistan president Musharraf, netizens expressed outrage

కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్. ఈయనకు వివాదాలేం కొత్తకాదు. తాజాగా మరోసారి వివాదస్పద ట్వీట్ చేశారు. పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ మృతికి సంతాపం తెలిపిన శశి థరూర్ ఆయనను శాంతి శక్తిగా అభివర్ణించారు. దీంతో సోషల్ మీడియాలో శశిథరూర్ విపరీతంగా ట్రోల్ అవుతున్నారు.

శశిథరూర్ చేసిన ట్వీట్ పై కొంతమంది నెటిజన్లు మండిపడుతున్నారు. పర్వేజ్ ముషారఫ్ వల్లే కార్గిల్ యుద్ధం జరిగిందని నెటిజన్లకు శశిథరూర్‌కు గుర్తు చేశారు. సంతాపం తెలిపే ముసుగులో శశి థరూర్ పర్వేజ్ ముషారఫ్‌ను అతిగా పొగిడారని, ఇది సరికాదని నెటిజన్లు గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. శశి థరూర్ ట్వీట్ చేస్తూ, “పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ అరుదైన అనారోగ్యంతో మరణించారు. ఒకప్పుడు భారతదేశానికి బద్ధ శత్రువు, అతను 2002-2007లో శాంతి కోసం నిజమైన శక్తిగా మారాడు అంటూ ట్వీట్ చేశారు.

ఈ ట్వీట్‌పై బీజేపీ అధికార ప్రతినిధి షాజాద్ స్పందిస్తూ.. “ఒసామా బిన్ లాడెన్, తాలిబాన్‌లను ప్రశంసించిన పర్వేజ్ ముషారఫ్, రాహుల్ గాంధీని కూడా ప్రశంసించారు. అతనిని పెద్దమనిషి అని పిలిచారు. అతని మద్దతును హామీ ఇచ్చారు. బహుశా అంతే.” శశి థరూర్ ప్రశంసించడమే కారణం. కార్గిల్ వాస్తుశిల్పి, ఉగ్రవాదానికి మద్దతుదారు.”అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.