కుంభమేళాపై కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు… - MicTv.in - Telugu News
mictv telugu

కుంభమేళాపై కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు…

October 15, 2020

Congress leader Udit Raj makes controversial statement on Kumbh Mela

హిందువులకు అత్యంత పవిత్ర క్రతువుగా భావించే కుంభమేళా ప్రధానంగా హరిద్వార్, ఉజ్జయినీ, ప్రయాగ్‌రాజ్, నాసిక్ నగరాల్లో జరుగుతోంది. ప్రతి 12 ఏళ్లకు ఒకసారి కుంభమేళా జరుగుతుంది. దేశంలోని 12 నదులకు సంబంధించి 12 కుంభమేళాలు జరుగుతుంటాయి. వచ్చే ఏడాది ప్రయాగ్‌రాజ్‌లో పూర్ణ కుంభమేళా జరగబోతున్నది. 144 సంవత్సరాల తరువాత జరిగే ఈ కుంభమేళా కోసం ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రూ.4200 కోట్లు కేటాయించింది. దీనిపై కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ ఎంపీ ఉదిత్ రాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 

కుంభమేళాకు రూ. 4200 కోట్లు ఖర్చు చేయడం ఏంటని ప్రశ్నించాడు. రాష్ట్రానికి ప్రత్యేకంగా ఒక మతం ఉండదని అలాంటప్పుడు మత ప్రచారం కోసం ఇంత డబ్బు ఎలా ఖర్చు చేస్తారని విమర్శించాడు. ఉదిత్ రాజ్ వ్యాఖ్యలపై హిందూ సంఘాలు, బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీని గురించి కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ..’కోట్ల మంది హాజరయ్యే ఘట్టానికి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.’ అని తెలిపారు. అలాగే యూపీ మంత్రి బ్రిజేష్ పాథక్ స్పందిస్తూ..’కుంభమేళా అన్నది ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే సంబంధించినది కాదు. ప్రపంచంలోని కోట్లాది మంది భక్తులు ఈ కుంభమేళాకు హాజరు అవుతారు. కుంభమేళాకు వచ్చే వారికి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.’ అని తెలిపారు.