కరోనాను ఓడించిన వీహెచ్..సతీమణితోపాటు ఇంటికి.. - MicTv.in - Telugu News
mictv telugu

కరోనాను ఓడించిన వీహెచ్..సతీమణితోపాటు ఇంటికి..

July 1, 2020

v hanumantha rao.

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వీ. హనుమంతరావు దంపతులకు కరోనా సోకిందని జూన్ 21న నిర్దారణ అయినా సంగతి తెల్సిందే. దీంతో హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో పది రోజుల పాటు చికిత్స తీసుకుకున్నారు. ఈ రోజు కరోనాను జయించి డిశ్చార్జ్ అయ్యారు. 

60 ఏళ్ళు దాటిన వీహెచ్ దంపతులు వైరస్ నుంచి కోలుకొని బయటపడటంతో ఆయన అభిమానులు, పార్టీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే, జూనియర్ డాక్టర్ల సమ్మెకు మద్ధతుగా గాంధీ ఆస్పత్రికి వెళ్లినప్పుడు వీహెచ్‌కు కరోనా అంటి ఉంటుందని తెలుస్తోంది. కాగా, తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పద్మారావు, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి, గణేశ్ గుప్తా కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వీరంతా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.