కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచి తర్వాత పార్టీ మారి ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీలో చేరిన 12 మంది ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ అగ్రనేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పోలీస్ స్టేషనులో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, మల్లురవి, మాజీ ఎమ్మెల్యే సంపత్ తదితరులు ఫిర్యాదు చేసిన వారిలో ఉన్నారు. స్వప్రయోజనాల కోసం అధికార పార్టీలో చేరారని, పార్టీ మారిన తర్వాత రాజకీయ, ఆర్ధిక ప్రయోజనాలు పొందారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై విచారించి సీబీఐ చేత విచారణ జరిపించాలని కోరారు. కాగా, 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున గెలిచిన ఇప్పటి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, తాండూర్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, గండ్ర వెంకట రమణా రెడ్డి, రేగ కాంతారావు, చిరుమర్తి లింగయ్య, ఉపేందర్ రెడ్డి, జాజుల సురేందర్, బానోతు హరిప్రియా నాయక్, ఆత్రం సక్కు, సుధీర్ రెడ్డి, వనమా వెంకటేశ్వర రావులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు.