Congress MLA Jagga Reddy and MLC Jeevan Reddy expressed confidence that Digvijay Singh will solve their problem.
mictv telugu

దిగ్విజయ్ సింగ్ మా సమస్యను పరిష్కరిస్తారు.. కాంగ్రెస్ నేతలు

December 22, 2022

Congress MLA Jagga Reddy and MLC Jeevan Reddy expressed confidence that Digvijay Singh will solve their problem.

తెలంగాణ కాంగ్రెస్లో సంక్షోభ పరిస్థితులను చక్కదిద్దడానికి హైకమాండ్ ఆదేశాల మేరకు దిగ్విజయ్ సింగ్ రంగంలోకి దిగారు. ఈ క్రమంలోనే నేడు గాంధీ భవన్లో పీసీసీ నేతలను వేర్వేరుగా కలుస్తున్నారు. అంతకుముందే ఆయన్ను ఎమ్మెల్యే జగ్గారెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వేర్వేరుగా కలిశారు. దిగ్విజయ్ సింగ్ తమ సమస్యను పరిష్కారం చేస్తారనే పూర్తి విశ్వాసం ఉందని జగ్గారెడ్డి పేర్కొనగా.. దిగ్విజయ్ సింగ్ పార్టీలో విభేదాలకు తెర దింపుతారని జీవన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

టీకాంగ్రెస్‌లో విభేదాలకు దిగ్విజయ్ తెర దింపుతారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కూడా మొన్నటి రోజున వేరు సమావేశం పెట్టుకున్నారని…అలాగే తమ పార్టీ నేతలు సమావేశమయ్యారని ఇందులో తప్పేముందని పేర్కొన్నారు. రాష్ట్ర పార్టీలో అవసరం ఏర్పడినందునే దిగ్విజయ్ సింగ్ వచ్చారని తెలిపారు.

దిగ్విజయ్ సింగ్ తమ సమస్యను పరిష్కారం చేస్తారనే పూర్తి విశ్వాసం ఉందని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ పార్టీలో దిగ్విజయ్ సింగ్ చాలా సీనియర్ పేర్కొన్న అయన.. తెలంగాణ కాంగ్రెస్‌లో ఏం జరుగుతుందో ఆయనకు తెలుసన్నారు.