Congress Mla Jagga Reddy In New pic Viral
mictv telugu

ఫోటోలో ఉన్న ఈ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఎవరో గుర్తుపట్టగలరా.?

November 11, 2022

కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు తెలంగాణకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే. ఈ క్రమంలో శ్రీవారికి తలనీలాలు సమర్పించిన తర్వాత ఓ ఫోటో దిగారు. సోషల్ మీడియాలో ఈ ఫోటోని చూసి ఎవరై ఉంటారని చాలామంది బుర్ర కరాబ్ చేసుకుంటున్నరు. ఇంకా గుర్తుపట్టలేదా.? ఈయన ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి. ఈ పేరు వినగానే.. పెద్ద వెంట్రుకలు, గుబూరు గడ్డమే గుర్తుకు వస్తుంది. కానీ ఈ ఫోటోని చూసినవారు ఆయన్ను గుర్తు పట్టలేని పరిస్థితి..

కాగా, జగ్గారెడ్డికి దైవ భక్తి ఎక్కువ.. తరచూ ఆయన నియోజకవర్గంలో పూజల్లో పాల్గొంటారు. ఎప్పుడూ ఏదో మొక్కుతో ఆయన వెంట్రుకలు, గడ్డం పెంచుతూనే ఉంటారు. మరి, ఆయన శ్రీవారికి మొక్కిన మొక్కు ఏంటో.. ఆయన కోరిక తీరడంతోనే శ్రీ వేంకటేశ్వరస్వామికి మొక్కు చెల్లించుకున్నారేమో తెలియదు. కానీ, జగ్గారెడ్డి కొత్త ఫొటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిపోయాయి.