రాత్రిపూట మీ నాయకులు ఎక్క‌డికెళ్తున్నారో బ‌య‌ట‌పెట్టాలా? - MicTv.in - Telugu News
mictv telugu

రాత్రిపూట మీ నాయకులు ఎక్క‌డికెళ్తున్నారో బ‌య‌ట‌పెట్టాలా?

May 3, 2022

కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ నేపాల్ లోని ఖాట్మండూ నైట్ క్లబ్ లో పార్టీ చేసుకుంటున్నట్లుగా కనిపించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై బీజేపీ, టీఆర్ఎస్ తదితర పార్టీల నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా ఈ వ్య‌వహారంపై కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి స్పందించారు. త‌మ నాయ‌కుడు పెళ్లికి వెళ్లిన ఓ వీడియోను చూపించి దుష్ప్ర‌చారం చేస్తున్నార‌ని , ఫంక్షన్ కు వెళ్లిన చోట ఏముందో రాహుల్ కు ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు. ప్ర‌తిప‌క్షాలు ఈ వీడియోను షేర్ చేస్తూ చిల్ల‌ర రాజ‌కీయాలు చేస్తున్నాయ‌ని, ఫంక్షన్‌కు వెళ్ళిన చోట ఏముందో రాహుల్ గాంధీకి ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు. ‘‘మీ పార్టీల నేతలు రాత్రి పూట ఎక్కడికి వెళుతున్నారో బయట పెట్టమంటారా?’’ అంటూ జగ్గారెడ్డి ఆయా పార్టీ నాయ‌కులను హెచ్చరించారు.