Congress MLA Jaggareddy announced that he is not contesting in the next election
mictv telugu

వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. జగ్గారెడ్డి సంచలన ప్రకటన

September 7, 2022

సంగారెడ్డి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేయడం లేదంటూ అందరికి షాక్ ఇచ్చారు. త‌న స్థానంలో సంగారెడ్డికి చెందిన కాంగ్రెస్ కార్య‌కర్త‌ను బ‌రిలోకి దించుతాన‌ని ఆయ‌న మ‌రో ఆస‌క్తిక‌ర ప్ర‌క‌ట‌న చేశారు. ఒకవేళ క్యాడర్‌ వద్దంటే, తన సతీమణి నిర్మలను బరిలోకి దింపుతానని పేర్కొన్నారు. తన స‌తీమ‌ణితో క‌లిసి బుధ‌వారం పార్టీ కార్యక‌ర్త‌ల‌తో భేటీ అయిన సంద‌ర్భంగా జ‌గ్గారెడ్డి ఈ ప్ర‌క‌ట‌న చేశారు. ఈ ఎన్నిక‌ల్లో తాను పోటీ చేయ‌న‌ని చెప్పిన జ‌గ్గారెడ్డి… 2028లో జ‌రిగే ఎన్నిక‌ల్లో మాత్రం సంగారెడ్డి నుంచి తానే పోటీ చేస్తాన‌ని ప్ర‌కటించారు.

దీంతో.. జగ్గారెడ్డి వచ్చే ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయనంటున్నారనే విషయంపై క్లారిటీ ఇవ్వకపోవడంపై పార్టీ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది. ఈనేపథ్యంలో.. ప్రతి రాజకీయ పరిణామంపై వేగంగా స్పందించే కాంగ్రెస్‌ పార్టీ ఫైర్‌ బ్రాండ్ జగ్గారెడ్డి ఈ మధ్య కాలంలో మౌనంగా ఉంటున్నారు. దీంతో.. సొంత పార్టీలో కల్లోలం లాంటి పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో, ఆయన నోరెత్తడం లేదు. కొద్దిరోజులుగా జగ్గారెడ్డి గాంధీభవన్‌కు కూడా రావడం లేదు. అయితే.. జగ్గారెడ్డి అసలు ఏం చేయాలనుకుంటున్నారనే విషయాలు రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.