సుదీర్ఘ విరామం తరువాత మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటైన సంగతి తెల్సిందే. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శివసేన పార్టీ అధినేత ఉద్దవ్ ఠాక్రే ఇటీవల ప్రమాణస్వీకారం చేశారు. తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్యే నానా పాటోలే అసెంబ్లీ స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
స్పీకర్ రేసు నుంచి బీజేపీ వెనక్కి తగ్గడంతో పాటోలే ఎన్నిక ఏకగ్రీవమైనది. మహారాష్ట్రలో స్పీకర్ ఎన్నిక జరగడానికి కొద్ది గంటల ముందే.. ప్రతిపక్ష బీజేపీ ఈ అనూహ్య నిర్ణయం తీసుకుంది. పార్టీ నేతలతో చర్చించిన తరువాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ వెల్లడించారు.