వలస కార్మికులకు సోనియా టికెట్లు కొనిందంట..  - MicTv.in - Telugu News
mictv telugu

వలస కార్మికులకు సోనియా టికెట్లు కొనిందంట.. 

May 11, 2020

Congress MLA Pamphlet Distribution

వలస కార్మికులను సొంత ప్రాంతాలకు తరలిస్తున్న సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకరు హడావిడి చేశారు. మీ టిక్కెట్ ఛార్జీలు సోనియా గాంధీ భరించారంటూ కరపత్రాలను పంచి పెట్టారు. పంజాబ్‌లోని భంటిండా రైల్వే స్టేషన్‌లో ఇది జరిగింది. కార్మికులను ఉద్దేశించి తమ పార్టీ చేస్తున్న సేవలను వారికి వివరించారు. ఆయన చేసిన ఈ పనికి సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. 

పంజాబ్ నుంచి బీహార్‌లోని ముజాఫర్‌పూర్‌కు కూలీలను తీసుకెళ్లేందుకు శ్రామిక్ రైలు ప్లాట్ ఫాంపై సిద్ధంగా ఉంది. ఆ సమయంలో అక్కడికి ఎమ్మెల్యే అమరిందర్ రాజా తన అనుచరులతో కలిసి వచ్చారు. తన చేతిలో కొన్ని కరపత్రాలను తెచ్చి కూలీలకు అందించారు. ‘మీ ట్రైన్ టికెట్‌ను సోనియా గాంధీ కొన్నారు. మీ అవసరంలో కాంగ్రెస్ పార్టీ అందుబాటులో ఉంటుంది. సీఎం అమరిందర్ సింగ్ మిమ్నల్ని గమ్యస్థానాలకు చేర్చుతున్నారు’ అంటూ ప్రసంగించారు. దానికి సంబంధించిన విషయాలను కరపత్రంలో చేర్చామని ప్రయాణ సమయంలో వాటిని చదువు కోవాలని సూచించారు. కాగా వలస కూలీలను తరలించేందుకు కేంద్రం శ్రామిక్ రైళ్లను  ఏర్పాటు చేసింది. అయితే కూలీల ఖర్చును భరించేలమని తేల్చడంతో సోనియా గాంధీ ఇటీవల తమ పార్టీ తరుపున ఆ డబ్బులు చెల్లిస్తామని ప్రకటించారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే ఈ ప్రచారానికి శ్రీకారం చుట్టారు.