'కేసీఆర్ గారి వల్ల 60 కి.మీ. ట్రాఫిక్ జామ్'.. ఎమేల్యే సీతక్క - MicTv.in - Telugu News
mictv telugu

‘కేసీఆర్ గారి వల్ల 60 కి.మీ. ట్రాఫిక్ జామ్’.. ఎమేల్యే సీతక్క

October 18, 2020

nbgcng

కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయాణాలు చేయవద్దని కోరారు. సీఎం కేసీఆర్ ప్రయాణాల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆమె తెలిపారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు. సీఎం కేసీఆర్ ఆయన 300 ఎకరాల ఫామ్ హౌస్ నుంచి సీఎం క్యాంపు కార్యాలయానికి ప్రయాణాలు చేయడం వల్ల 60 కి.మీ. మేర ట్రాఫిక్ జామ్ అవుతోందని ఆమె అన్నారు. 

నగరంలో భారీ వర్షాలు పడుతున్న కారణంగా కేసీఆర్ ఇలాంటి ప్రయాణాలు తగ్గిస్తే ప్రజలు తడవకుండా ఇళ్లకు వెళ్తారని తెలిపారు. దయచేసి ఈ విషయంపై ఒకసారి ఆలోచించాలని అన్నారు. ట్రాఫిక్ జామ్‌కి సంబంధించిన వీడియోను ఆమె ట్విట్టర్‌లో పోస్ట్ చేసారు. సీఎం హోదాలో ఉన్న ఆయన ప్రయాణించేటప్పుడు ట్రాఫిక్‌ను ఆపేస్తారు. గతంలో కూడా ఎందరో నెటిజన్లు దీనిపై అసహనం వ్యక్తం చేశారు.