Congress MLA Seethakka doing modern cutting for children .. Video goes viral
mictv telugu

చిన్నారులకు మోడ్రన్ కటింగ్ చేసిన సీతక్క.. వీడియో వైరల్

June 14, 2022

Congress MLA Seethakka doing modern cutting for children .. Video goes viral

నిరాడంబర జీవితానికి మారుపేరు కాంగ్రెస్ ఎమ్మెల్యే ధనసరి సీతక్క. ప్రజాప్రతినిధి అన్న పదానికి సరైన నిర్వచనంలా ఆమె ప్రజల్లోనే ఉంటారు. ప్రజలతోనే ఉంటూ.. వారి మంచి చెడులను అడిగి తెలుసుకుంటారు. తాజాగా ప‌లువురు చిన్నారుల‌కు మోడ్ర‌న్ హెయిర్ స్ట‌యిల్ చేశారు సీత‌క్క‌. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది.

రచ్చబండ కార్యక్రమానికి వెళుతూ మార్గమధ్యంలో ఓ చిన్న కుంట వద్ద ఆగారు. స్వయంగా కత్తెర పట్టుకొని కొందరు చిన్నారులకు క్రాప్ చేశారు. సోష‌ల్ మీడియాలో ఆ వీడియోను పంచుకుంటూ.. నగరాల్లో పెద్ద పెద్ద భవంతులు ఉంటాయని, భారీ మౌలిక సదుపాయాల వ్యవస్థలు కనిపిస్తుంటాయన్నారు. కానీ చిన్న చిన్న కుంటల్లో స్నానం చేయడం, సహచరులతో కలిసి ఆడుకోవడం వంటి ఆనందాలను నగరాలు ఇవ్వలేవని అభిప్రాయపడ్డారు. రచ్చబండకు వెళుతుండగా ఈ పిల్లలను చూడగానే పాతజ్ఞాపకాలు మనసులో మెదిలాయని సీత‌క్క చెప్పారు.