Congress MLA Seethakka Reacts On Confusion In Presidential Election Voting
mictv telugu

పొరపాటున ద్రౌపది ముర్ముకు ఓటు వేసిన ఎమ్మెల్యే సీతక్క

July 18, 2022

నేడు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలలో భారత రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. తెలంగాణ అసెంబ్లీలోనూ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. పోలింగ్‌లో అధికార టీఆర్ఎస్‌తో పాటు పలు పార్టీల ఎమ్మెల్యేలు తమ ఓటుహక్కు వినియోగించుకుంటున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ఓటు విషయంలో గందరగోళం ఏర్పడింది. విపక్షాలు బలపరిచిన యశ్వంత్ సిన్హాకు కాకుండా… ఎన్డీయే బలపరిచిన ద్రౌపది ముర్ముకు ఆమె ఓటు వేశారు. ఈ ఘటనపై ఆమె మాట్లాడుతూ, పొరపాటున ద్రౌపది ముర్ముకు ఓటు వేశానని చెప్పారు. పొరపాటు జరిగినందువల్ల తనకు మరోసారి ఓటు వేసేందుకు అవకాశం ఇవ్వాలని అధికారులను కోరినట్టు తెలిపారు. అయితే, నిబంధనల ప్రకారం మరోసారి అవకాశం ఇవ్వలేమని అధికారులు తెలిపినట్టు సీతక్క మీడియాకు తెలిపారు.

అయితే ఈ విషయమై సీతక్క మాట్లాడుతూ… తాను ఓటు సరిగ్గానే వేశానని తెలిపారు. అయితే మరో అభ్యర్థి పేరు దగ్గర పెన్ మార్క్ పడిందని, దీంతో ఓటు చెల్లుబాటు అవుతుందో లేదో అన్న అనుమానంతోనే మరో బ్యాలెట్ అడిగానని పేర్కొన్నారు. అయితే మరో బ్యాలెట్ ఇవ్వలేమని అధికారులు చెప్పడంతో వెనుదిరగాల్సి వచ్చిందని ఆమె తెలిపారు. బ్యాలెట్ పత్రంలో ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము పేరు మొదట, విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా పేరు తర్వాత ఉన్నాయి.