లాక్‌డౌన్‌ను ఉల్లంఘించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే - MicTv.in - Telugu News
mictv telugu

లాక్‌డౌన్‌ను ఉల్లంఘించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే

March 30, 2020

Congress mla shailesh pandey break lock down rules

కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన సంగతి తెల్సిందే. లాక్‌డౌన్‌ను పాటించేలా ప్రజలను జాగృతం చేయాల్సిన ప్రజాప్రతినిధులే లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. ఇటీవల కర్ణాటకలో ఓ ఎమ్మెల్యే లాక్‌డౌన్ నిబంధనలను బేఖాతర్ చేసిన సంగతి తెల్సిందే. 

తాజాగా చత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే శైలేష్ పాండే కూడా లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లఘించారు. దీంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే తన నివాసంలో పేదలకు రేషన్ పంపిణీ చేస్తున్న విషయం తెలిసి ప్రజలు పెద్ద సంఖ్యలో గుమికూడారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు వారిని చెదరగొట్టి ఆయనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 144 సెక్షన్ అమల్లో ఉంది. దీనిని ఉల్లంఘించి సరుకులు పంపిణీ చేసిన ఎమ్మెల్యేపై సెక్షన్ 188, 144, 279ల కింద కేసు నమోదు చేశారు. అయితే, ఈ విషయంలో ఎమ్మెల్యే వాదన మరోలా ఉంది. తన ఇంటి వద్ద జనం పెద్ద సంఖ్యలో గుమికూడడంతో తానే స్వయంగా పోలీసులకు సమాచారం అందించానని శైలేష్ పాండే తెలిపారు. ప్రజలు తిండిలేక కష్టాలు ఎదుర్కొంటుండడంతోనే తాను రేషన్ సరఫరా చేశానని, అది తప్పెలా అవుతుందని ప్రశ్నించారు.