అవును, నెహ్రూ ఫ్యామిలీకి మేం బానిసలమే.. అసెంబ్లీలో షాకింగ్ కామెంట్స్ - MicTv.in - Telugu News
mictv telugu

అవును, నెహ్రూ ఫ్యామిలీకి మేం బానిసలమే.. అసెంబ్లీలో షాకింగ్ కామెంట్స్

March 23, 2022

03

రాజస్తాన్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి సలహాదారు, కాంగ్రెస్ ఎమ్మెల్యే సన్యామ్ లోధా షాకింగ్ కామెంట్స్ చేశారు. తాము గాంధీ – నెహ్రూ కుటుంబానికి బానిసలమేనంటూ వ్యాఖ్యానించారు. ‘ అవును మేం బానిసలమే. చచ్చేంత వరకు ఆ కుటుంబానికి బానిసత్వం చేస్తాం’ అని లోధా అన్నారు. సీఎం అశోక్ గెహ్లాత్ సలహాదారుల్లో లోధా ఒకరు. ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్ష నేత రాజేంద్ర రాథోడ్ వ్యంగంగా స్పందించారు. ‘ మీ బానిసత్వానికి అభినందనలు. ఇంత బానిసత్వం చేస్తున్న మీకు కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ కూడా ఇవ్వలేదు.’ అని బీజేపీ సభ్యులు ఎద్దేవా చేయడంతో సభలో కాసేపు గందరగోళ వాతావరణం నెలకొంది. కాగా, సన్యామ్ లోధాకు 2018 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ ఇవ్వలేదు. దాంతో ఆయన స్వతంత్రంగా పోటీచేసి గెలిచిన తర్వాత కాంగ్రెస్‌కు మద్ధతిచ్చారు. అనంతరం సీఎం అశోక్ గెహ్లాత్ తన సలహాదారుగా నియమించుకున్నారు.