Congress MLA Sitakka wrote the LLM Entrance Exam
mictv telugu

పరీక్ష రాసిన ఎమ్మెల్యే సీతక్క.. సెల్ఫీలు తీసుకున్న అభ్యర్థులు

July 22, 2022

ములుగు ఎమ్మెల్యే సీతక్క విద్యార్థిగా మారిపోయారు. ఈరోజు తెలంగాణలో జరిగిన ఎల్ఎల్ఎం ప్రవేశ పరీక్ష రాశారు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘నేను నా ఎల్ఎల్ఎం ప్రవేశ పరీక్ష రాశాను. విద్యార్థి జీవితమే ఉత్తమ జీవితం’ అంటూ పోస్టు చేశారు. దాన్ని కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి ట్యాగ్ చేశారు. సీతక్క చేసిన ఈ పోస్టుపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కామెంట్స్ చేస్తూ.. సీతక్కపై తమకున్న అభిమానాన్ని వ్యక్తపరుస్తున్నారు. సీతక్క పరీక్ష రాసేందుకు ఎగ్జామ్ సెంటర్ కు వెళ్లగా.. చాలామంది ఫొటోలు దిగేందుకు ఆసక్తి చూపారు. సీతక్క ఓపిగ్గా అందరితో సెల్ఫీలు దిగింది. చిన్న పిల్లలను ఎత్తుకొని ముద్దు చేసింది.

గతంలో సీతక్క ఎల్ఎల్‌బీ పూర్తి చేశారు. నేడు ఎల్ఎల్ఎం పరీక్షకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో పరీక్షకు అటెండ్ అయిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. పరీక్ష ముగిసిన తరువాత అభ్యర్థులు సీతక్కతో సెల్ఫీలు దిగుతూ ముచ్చటించారు. అయితే, వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేసిన సీతక్క.. ‘స్టూడెంట్ లైఫ్ ఈజ్ బెస్ట్ లైఫ్ ‘అని పేర్కొన్నారు.