పీసీసీ ప్రెసిడెంట్ అవుతా.. బీజేపీకి ఓటేయండి.. కోమటిరెడ్డి ఆడియో లీక్ - MicTv.in - Telugu News
mictv telugu

పీసీసీ ప్రెసిడెంట్ అవుతా.. బీజేపీకి ఓటేయండి.. కోమటిరెడ్డి ఆడియో లీక్

October 21, 2022


ఒక పక్క అన్నాదమ్ముల అనుబంధం.. మరోపక్క బద్ధ శత్రువులైన పార్టీల రాజకీయాలు.. పార్టీతో అనుబంధంపై సోదర బంధమే గెలిచింది. తెలంగాణ కాంగ్రెస్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బీజేపీకి జైకొట్టారు. మునుగోడు ఉప ఎన్నికల బరిలో బీజేపీ అభ్యర్థిగా నిలిచిన తన సోదరుడు రాజగోపాల్ రెడ్డికి ఓటు వేయాలని కోరారు. దీనికి సంబంధించిన ఆడియో కలకలం రేపుతోంది. సాక్ష్యాత్తూ కాంగ్రెస్ ప్రధాన ప్రచారకర్తే పార్టీ ప్రయోజనాలను తోసిరాజని ఇలా కోరడంతో హస్తం పార్టీ శ్రేణులు మొత్తుకుంటున్నారు.

ఓ కాంగ్రెస్ నాయకుడితో వెంకట్ రెడ్డి మాట్లాడిన ఆడియోలో ఏముందంటే… ‘ఈ దెబ్బతో పీసీసీ ప్రెసిడెంట్ నేనే అవుతా. రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేస్తి, అధికారంలోకి తీసుకొస్తా. పార్టీలను చూడొద్దు రాజగోపాల్ రెడ్డికి ఓటెయ్యాలి. ఏదైనా ఉంటే నేనే చూసుకుంటా. చచ్చిన బతికిన రాజగోపాల్ రెడ్డి సహాయం చేస్తూ ఉంటారు’ అని కోరారు.