వంద కోట్ల అవినీతిని అడ్డుకోకుంటే మేమేంటో చూపిస్తాం - MicTv.in - Telugu News
mictv telugu

వంద కోట్ల అవినీతిని అడ్డుకోకుంటే మేమేంటో చూపిస్తాం

May 25, 2022

కాంగ్రెస్ పార్టీ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వంద కోట్ల స్కాం చేస్తున్న మంత్రిని అడ్డుకోకుంటే తామేంటో చూపిస్తామని హెచ్చరించారు. బుధవారం నార్కట్‌పల్లి వద్ద జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్బంగా జగదీష్ రెడ్డి చేస్తున్న అవినీతి, అక్రమాలపై ధ్వజమెత్తారు. ‘మా జిల్లాకు పనికిమాలిన మంత్రిని నియమించారు. జగదీష్ రెడ్డి భూ అక్రమాలకు, ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో రియల్ ఎస్టేట్ ధరల కోసం కలెక్టరేట్ కార్యాలయ స్థలాన్ని మార్చారు. దీని ద్వారా వందల కోట్లు సంపాదించాడు. ఇప్పుడు నా సొంత మండలమైన నార్కట్ పల్లి మీద పడ్డాడు. 40 ఎకరాల పెద్ద చెరువును ఆక్రమించి వెంచర్ నిర్మించాలని బినామీలతో కలిసి ప్లాన్ చేస్తున్నాడు. చెరువు మొత్తం మట్టి నింపి 100 కోట్ల స్కామ్ చేస్తున్నాడు. ఈ విషయంపై ఇప్పటికే కలెక్టరుకు ఫిర్యాదు చేశాను. ప్రభుత్వం స్పందించి అక్రమాలను ఆపకపోతే చుట్టుపక్కల గ్రామాల ప్రజలతో కలిసి పనులు అడ్డుకుంటాం. మా పవరేంటో చూపిస్తామ’ని వ్యాఖ్యానించారు.