ఎవరెన్ని కుట్రలు చేసినా బీజేపీదే అధికారం : బండి సంజయ్ - Telugu News - Mic tv
mictv telugu

ఎవరెన్ని కుట్రలు చేసినా బీజేపీదే అధికారం : బండి సంజయ్

February 15, 2023

 

bandi sanjay

తెలంగాణలో రాజకీయాలు వేడెక్కాయి. కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తెలంగాణలో బీజేపీ బలంగా మారుతుందని..పార్టీని ఎదుర్కొనేందుకు బీఆర్ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్, కమ్యూనిస్టులు కలిసి కట్టుగా పోటీ చేసేందుకు రెడీ అయ్యారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. వాళ్లంతా దండుపాళ్యం బ్యాచ్ అని తనదైన స్టైల్లో ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో అసలు కాంగ్రెస్ పార్టీనే లేదన్న బండి సంజయ్…కాంగ్రెస్ నాయకులకు ఇప్పుడు వాస్తవాలు తెలిసాయని విమర్శించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండూ ఒక్కటేనని… ఈరెండు పార్టీలూ కలిసి పోటీ చేస్తాయన్న విషయం తాము గతంలోనే చెప్పామన్న విషయాన్ని గుర్తు చేశారు.

కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే…వాళ్లు గెలిచి చివరి వెళ్లేది బీఆర్ఎస్ లోకే …అసలు తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు బీఆర్ఎస్‎తో కొట్లాడే దమ్మేలేదన్నారు. ఎవరెన్నీ కుట్రలు చేసినా..ఎన్ని పార్టీలు పొత్తు పెట్టుకున్నా..వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది బీజేపీనే. అందుకే బీజేపీని టార్గెట్ చేసి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని బండి సంజయ్ మండిపడ్డారు.