కరోనా భయంతో కూలీలు రావట్లేదని.. వరి నాట్లు వేసిన ఎంపీ - MicTv.in - Telugu News
mictv telugu

కరోనా భయంతో కూలీలు రావట్లేదని.. వరి నాట్లు వేసిన ఎంపీ

July 16, 2020

Congress MP Paddy in Village

రాజకీయ నాయకులు ఎన్నికల ప్రచారంలో వరినాట్లు వేస్తూ.. కటింగ్ తీస్తూ.. ఫొటోలకు ఫోజులు ఇవ్వడం చూసి ఉంటాం. కానీ కరోనా తర్వాత ఆ పరిస్థితి మారింది. ఓ ఎంపీ నిజంగానే కూలీలతో కలిసి తన సొంత పొలంలో వరి నాట్లు వేశారు. కరోనా భయంతో కూలీలు పనికి రావడం లేదని స్వయంగా ఆమె బురదలోకి దిగారు. ఛ‌త్తీస్ గ‌ఢ్ నుంచి రాజ్య‌స‌భ‌కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న ఫూలో దేవీ నీత‌మ్ చేసిన పనితో అందరిని ఆకర్షిస్తున్నారు. 

ఎంపీ నీత‌మ్ సొంత గ్రామం కొండగావ్‌లో వరి నాట్లు వేసేందుకు కూలీలు ముందుకు రావడం లేదు. కరోనా భయంతో చాలా మంది పనికి వచ్చేందుకు ఇష్టపడటం లేదు. ఈ విషయం తెలిసిన ఆమె  నేరుగా పంట పొలానికి వెళ్లి వ‌రి నాటేశారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ.. కూలీల కొర‌త ఉండటంతో సొంతంగా పంట వేసుకోవ‌డం మంచిదేనని వచ్చానని చెప్పారు. బిజీ షెడ్యూల్ ఉన్నా తప్పలేదని అన్నారు. ఇలా పంట పొలానికి రావడం ఆహ్లాదంగా ఉందని పేర్కొన్నారు. భౌతిక దూరం పాటిస్తూ.. ధైర్యం వ్యవసాయ పనులు చేసుకోవాలని సూచించారు.