బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు కాంగ్రెస్ వ్యూహాలను రచిస్తోంది. ఛత్తీస్‌గఢ్‌లో సీఎం రమణ్ సింగ్‌పై బలమైన అభ్యర్థిని బరిలోకి దించేందుకు రెడీ అయ్యింది. రాజ్‌నంద్‌గావ్ నియోజకవర్గంలో మాజీ ప్రధాని అటల్ బీహారీ వాజ్‌పేయీ మేనకోడలు కరుణ శుక్లాను బరిలోకి దిగుతున్నారు.సోమవారం ఛత్తీస్‌గఢ్ తొలి దశ ఎన్నికల కోసం కాంగ్రెస్ 18మంది అభ్యర్థులను ప్రకటించింది. నవంబర్ 12వ తేదీన ఛత్తీస్‌గఢ్‌లో ఎన్నికలు జరగనున్నాయి. 18మందిలో కరుణకు స్థానం కల్పించారు. స్క్రీనింగ్ కమిటీ సూచన మేరకే ఆమెను రమణ్‌సింగ్‌పై పోటీ చేసేందుకు హైకమాండ్ నిర్ణయించింది. కొద్ది రోజులుగా కరుణ శుక్లా గళం విప్పుతున్నారు. అంతేకాదు వాజ్‌పేయీ మరణాన్ని బీజేపీ తమ రాజకీయాలకు వాడుకుంటోందని ఆమె తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఎన్నికల నేపథ్యంలోనే వాజ్ పేయీ అస్థికలతో యాత్ర నిర్వహించారని మండిపడ్డారు.
కరుణ శుక్లా 1950 ఆగస్టు 1న జన్మించారు. భోపాల్ యూనివర్సిటీలో ఉన్నత చదవులు చదివిన కరుణ.. రాజకీయాల్లోకి వచ్చి బీజేపీలో చేరారు. 1993లో ఆమె మొదటి సారి ఎమ్మెల్యేగా గెలిచారు. 2004లో జాంజ్‌గిర్ నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. తనను మాసినకంగా వేధిస్తున్నారని ఆరోపిస్తూ 2013లో ఆమె బీజేపీ నుంచి బయటకొచ్చారు. అనంతరం 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్‌పై బిలాస్పూర్ లోక్‌సభ స్థానంలో పోటీచేసి ఓడిపోయారు. ఇక ఈ ఎన్నికల్లో ఏకంగా చత్తీస్‌గఢ్ సీఎం రమణ్‌సింగ్‌పై బరిలో దిగుతున్నారు.