జగిత్యాలలో దారుణం.. కాంగ్రెస్ కౌన్సిలర్‌పై కత్తులతో దాడి.. - MicTv.in - Telugu News
mictv telugu

జగిత్యాలలో దారుణం.. కాంగ్రెస్ కౌన్సిలర్‌పై కత్తులతో దాడి..

April 17, 2019

జగిత్యాలలో దారుణం చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్పై కొందరు కత్తులతో దాడి చేశారు. కలకలం రేపుతున్న ఈ ఘటన జిల్లా కేంద్రంలోని కృష్ణానగర్‌లో మంగళవారం అర్ధరాత్రి జరిగింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్ శ్రీనివాస్‌‌పై నిన్న రాత్రి కొందరు గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో దాడిచేశారు. ఈ దాడిలో శ్రీనివాస్ కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతణ్ణి జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న శ్రీనివాస్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు పేర్కొంటున్నారు.

ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పాతకక్షల నేపథ్యంలోనే శ్రీనివాస్ పై దాడి జరిగినట్లు అనుమానిస్తున్నారు. తనపై ఐదుగురు దాడి చేసినట్లు శ్రీనివాస్ పోలీసులకు చెప్పడంతో.. వారు నిందితుల కోసం గాలిస్తున్నారు.