Congress Party New Stratagy
mictv telugu

కాంగ్రెస్ చేతిలో బ్రహ్మాస్త్రం..ఆ సెంటిమెంట్ పనిచేస్తుందా?

October 26, 2022

Congress Dalith Card Caste Vote Bank Mallikarjun Kharge India politcis

కాంగ్రెస్ మూలాల్ని వెతుక్కునే పనిలో పడింది. దూరమైన వర్గాల్ని ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తుంది. ఓటు బ్యాంక్ కోసం బ్రహ్మాస్త్రాన్ని మళ్లీ ప్రయోగించబోతోంది. దూరమైన దళిత సామాజిక వర్గానికి చేరువకావాలని చూస్తోంది. ఇందులో భాగంగా దళిత వ్యక్తికి కాంగ్రెస్ పగ్గాలు అప్పగించింది. 24 ఏళ్ల తర్వాత గాంధీయేతర కుటుంబానికి చెందిన వ్యక్తిని అధ్యక్షుడ్ని చేసింది. అంతేకాదు పార్టీకి పునర్ వైభవం తెచ్చేంచుందుకు సామాజిక సమీకరణల్ని నమ్ముకుంది. దళితుడి చేతికి పార్టీలు తాళాలు ఇవ్వడాన్ని మంచి మార్పుగానే భావించాలా?పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తుందా?దూరమైన సామాజిక వర్గాలు మళ్లీ దగ్గరవుతాయా?

మార్పు మొదలైంది…

కాంగ్రెస్ ఇండియన్ గ్రాండ్ ఓల్డ్ పార్టీ.పార్టీ తొలి నుంచి బ్రహ్మణులు,గాంధీ కుటుంబం నుంచే అధ్యక్షులు అయ్యారు. కాంగ్రెస్ సుప్రీమ్‌లుగా వీళ్లే పెత్తానం చెలాయించారు. గాంధీకుటుంబం లేదంటే బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచే కాంగ్రెస్ ని నడిపించే సారథలు ఉండేవారు. అధ్యక్షులు వీరు అయినా పార్టీ వెన్నంటే వుండి నడిపించింది దళితులు, వెనుకబడిన వర్గాలు. నాటి నుంచి నేటి దాకా కాంగ్రెస్ ఓటు బ్యాంక్ వారే. నేతలు మారినా వీరుమాత్రం పార్టీని నమ్ముకునే వస్తున్నారు.

డైవర్షన్ పాలిటిక్స్

బీజేపీ అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ ఓటు బ్యాంక్ పై కన్నేసింది. క్రమంగా ఆ వర్గాలకు దగ్గరవుతోంది.గతంలో పార్టీ అధ్యక్షుడిగా దళిత సామాజిక వర్గానికి చెందిన బంగారు లక్ష్మణ్ ని నియమించింది. ఇది కమలానికి పెద్దగా కలిసి రాలేదు. మళ్లీ మోదీ షా హయాంలో దళిత అస్త్రాన్ని ప్రయోగించారు. ఆ వర్గాల్ని ఆకట్టుకోవడమే లక్ష్యంగా అడుగులు వేశారు. అప్పటి నుంచి ఇప్పటి దాకా రాష్ట్రపతి ద్రౌపది ముర్మ్ ఎన్నిక దాకా ఇదే ఫార్ములాని ఫాలో అమలు చేసింది. ఈ ఫార్ములానే కాంగ్రెస్ ఓటు బ్యాంక్‌కు గండికొడుతూ వచ్చింది. ఎప్పుడూ పార్టీ వెంట వుండే దళితులు కాంగ్రెస్ కు దూరమవుతూ వస్తున్నారు.

ఇప్పటికి మేల్కొన్న కాంగ్రెస్

కాంగ్రెస్ మొత్తానికి మేల్కొంది. పార్టీ పట్టుకొమ్మలుగా వుండి దూరమైన సామాజిక వర్గాలపై నజర్ పెట్టింది. మళ్లీ వాళ్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేసింది. ఇందులో భాగంగానే మల్లికార్జున ఖర్గే ను కాంగ్రెస్ అధ్యక్షుడ్ని చేసింది. ఖర్గేది దళిత సామాజిక వర్గం. పార్టీలో మంచి పేరుంది. కార్మికుడి కొడుకు స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగి కాంగ్రెస్ అధిపతి అయ్యారు. ఇప్పుడు ఆయనపై కాంగ్రెస్ హైకమాండ్ బోలెడు ఆశలు పెట్టుకుంది. వెనుకపడిన వర్గాల్ని పార్టీ వైపు నడిపిస్తారని ఆశిస్తోంది.

బీఎస్పీ తర్వాత కాంగ్రెస్సే..

దళితులకు ప్రాధాన్వత ఇచ్చే పార్టీల్లో బీఎస్సీది అగ్రస్థానం.ఇప్పటికి,ఎప్పటికైనా ఆ పార్టీదే నెంబర్ వన్. ఎందుకంటే ఆ పార్టీ పుట్టిందే వాళ్లకోసం.బీఎస్పీ తర్వాత ఇప్పుడు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నది కాంగ్రెస్. దూరమైనా ఓటర్లకు మళ్లీ గాలం వేస్తుంది. ఎలాగైనా ఈ వర్గాల్లోకి చొచ్చుకుపోవాలని చూస్తుంది. నాటి దళిత కార్డే పార్టీని బతికిస్తుందని కాంగ్రెస్ భావిస్తోంది .దీనికోసం మల్లికార్జున ఖర్గేని అధ్యక్షుడ్ని చేసింది. ఈ సెంటిమెంట్ కాంగ్రెస్ కు వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి.