నేడు తెలంగాణలో పర్యటించనున్న రాహుల్ గాంధీ.. - MicTv.in - Telugu News
mictv telugu

నేడు తెలంగాణలో పర్యటించనున్న రాహుల్ గాంధీ..

October 20, 2018

తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో ఎలాగైన అధికారం దక్కించుకోవాలని కాంగ్రెస్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఓ వైపు సొంత ప్రచారం చేస్తూ.. మరోవైపు మహా కూటమితో చర్చలు జరుపుతోంది. తెలంగాణ ప్రచారం చేసేందుకు పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్వయంగా రంగంలోకి దిగనున్నారు. ఈ మేరకు శనివారం ఆదిలాబాద్ జిల్లా భైంసాలో రాహుల్ తొలి సభలో పాల్గొంటున్నట్లు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. మధ్యాహ్నం 12:30 నుంచి 1:30 వరకు రాహుల్ భైంసా సభలో పాల్గొననున్నారు.Congress Party Rahul Gandhi Starts Campaigning In Telangana Today భైంసా సభ ముగిశాక రాహుల్ అక్కడి నుంచి కామారెడ్డికి వెళ్తారు. అక్కడ మధ్యాహ్నం 2:30 నుంచి 3:30 గంటల వరకు సభలో పాల్గొంటారు. అక్కడి నుంచి రాహుల్ హెలికాఫ్టర్ లో హైదరాబాద్ చేరుకుని.. సాయంత్రం చార్మినార్ వద్ద జరిగే సభలో పాల్గొంటారు. రాత్రి బేగంపేట్ నుంచి ప్రత్యేక విమానంలో మళ్లీ ఢిల్లీ వెళ్లిపోతారని ఉత్తమ్ పేర్కొన్నారు.

అయితే ముస్లింలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో రాహుల్ సభలను నిర్వహింస్తుండటం చూస్తుంటే.. ముస్లింల ఓట్లపైనే కాంగ్రెస్ కన్నేసినట్లు తెలుస్తోంది. 2014 ఎన్నికల్లో తెలంగాణలో 44 స్థానాలకు  కాంగ్రెస్ కేవలం మూడు స్థానాల్లోనే గెలుపొందింది. వచ్చే ఎన్నికల్లో అలా జరగకుండా ఉండేందుకు రాహుల్ ఈ సభలకు హాజరవుతున్నట్లు తెలుస్తోంది.