Congress Party Satyagraha Diksha begins at Raj Ghat in Delhi
mictv telugu

Congress Satyagraha: రాహుల్ గాంధీకి సంఘీభావంగా కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్ష ప్రారంభం..

March 26, 2023

Congress Party Satyagraha Diksha begins at Raj Ghat in Delhi

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడంపై దేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ సత్యాగ్రహ దీక్షను చేపట్టింది. రాహుల్ గాంధీకి సంఘీభావంగా రాజ్ ఘాట్ వద్ద ఈ దీక్ష ప్రారంభమైంది. దీక్షలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే, ప్రియాంక గాంధీ, జైరాంరమేశ్, కేసీ వేణగోపాల్ తోపాటు పలువురు అగ్రనేతలు పాల్గొన్నారు. అన్ని రాష్ట్రాలు, జిల్లా కేంద్రాల్లోని గాంధీ విగ్రహాల ఎదుట ఈ నిరసనలు జరుగుతున్నాయి.

కాగా ఢిల్లీ పోలీసులు ఈ దీక్షకు పర్మిషన్ ఇవ్వలేదు. పోలీసుల పర్మిషన్ లేకున్నా కాంగ్రెస్ నేతలు దీక్ష ప్రారంభించారు. దీంతో రాజ్ ఘాట్ వద్ద పోలీసులు భారీ ఎత్తున మోహరించారు. రాహుల్ గాంధీని బీజేపీ మాట్లాడనివ్వడం లేదని..రాహుల్ దేశం కోసం ప్రజల కోసం పోరాడుతున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు. ఎన్ని అడ్డుకులు వచ్చిన మేమ ఆగేది లేదని…సత్యాగ్రహం చేసి తీరుతామని ఖర్గే అన్నారు.