Congress president election to be held on October 17, counting of votes on October 19
mictv telugu

కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నికలు.. షెడ్యూల్ విడుదల

August 28, 2022

కాంగ్రెస్ అధ్యక్ష పదవికి అక్టోబర్ 17న ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. సెప్టెంబర్ 22న ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు తెలిపాయి. ఈ మేరకు ఎన్నికల నిర్వహణ తేదీని ఖరారు చేసేందుకు భేటీ అయిన సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకున్నట్లు ఆ వర్గాలు వెల్లడించాయి. సెప్టెంబర్ 24 నుంచి 30 మధ్య నామినేషన్లు సమర్పించవచ్చని తెలిపాయి.

అక్టోబర్ ఒకటిన నామినేషన్ల పరిశీలన ఉంటుంది. అక్టోబర్ 17న ఎన్నికలు జరుగుతాయి. అక్టోబర్ 19న కొత్త అధ్యక్షుడెవరో తేలిపోతుంది. సీడబ్ల్యూసీ నిర్ణయాలను కాంగ్రెస్ పార్టీ నేతలు వేణుగోపాల్, మధుసూదన్ మిస్త్రీ, జై రాం రమేశ్ వెల్లడించారు. వర్చువల్‌గా జరిగిన సమావేశానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, ప్రియాంకా గాంధీ వాద్రా తదితరులు హాజరయ్యారు. గులాం నబీ ఆజాద్ సహా పలువురు సీనియర్ నేతలు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పారు. దీంతో ఉన్న నేతల్లో రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సమర్థుడని అంతా అభిప్రాయపడుతున్నారు. అయితే ఆయన మాత్రం రాహుల్ గాంధీయే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కావాలని కోరుకుంటున్నారు.