రూ.500కే గ్యాస్ సిలిండర్ - MicTv.in - Telugu News
mictv telugu

రూ.500కే గ్యాస్ సిలిండర్

November 12, 2022

కాంగ్రెస్ అదిరిపోయే మేనిఫెస్టోని ప్రకటించింది. 3 వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.10 లక్షల దాకా ఉచిత వైద్యం, నిరుద్యోగులకు నెలకు రూ.3వేలు ఇస్తామని ప్రకటించింది.రైతులకు 3లక్షలవరకు వ్యవసాయ రుణాల్ని మాఫీ చేస్తామని హామీ ఇచ్చింది. అంతే కాదు మరో 10 కీలక హామీల్ని ప్రకటించింది. ఈ మేనిఫెస్టో ఓట్లను రాలుస్తుందా? కాంగ్రెస్‌ని ఈసారైనా అధికారంలోకి తెస్తుందా?

ప్రచార వేడి

గుజరాత్ ఎన్నికలు డిసెంబర్ 1, 5 తేదీల్లో జరుగుతాయి. రెండు విడతల్లో పోలింగ్ ఉంటుంది. డిసెంబర్ 8న ఓట్లని లెక్కిస్తారు. బీజేపీ,కాంగ్రెస్ పోటీపడి హామీల వర్షం కురిపిస్తున్నాయి. ఎత్తుకు పైఎత్తులతో ప్రచారం వేడెక్కింది. వరుసగా ఏడోసారి అధికారంలోకి రావాలని బీజేపీ చూస్తోంది. ఈసారైనా కమలానికి ఖతర్నాక్ స్ట్రాటజీతో చెక్ పెట్టాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ఇందులోభాగంగానే కాంగ్రెస్ అదిరిపోయే మేనిఫెస్టోని ప్రకటించింది.

తొలి సంతకం

కాంగ్రెస్ మేనిఫెస్టోను రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ విడుదల చేశారు ఓటర్లను ఆకర్షించేందుకు ఉచిత హామీల వర్షం కురిపించారు. అమ్మాయిలకు కేజీ టు పీజీ ఉచిత విద్య,రాష్ట్రంలో మూడు వేల ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. 3 వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామన్నారు. అంతేకాదు రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం, కిడ్నీ, లివర్, హార్ట్ ట్రాన్స్ ప్లాంట్లు ఫ్రీగా చేయిస్తామని తెలిపింది. రైతులకు రూ.3లక్షల రూపాయల వరకు వ్యవసాయ రుణాల్ని మాఫీ చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అధికారంలోకి తొలి సంతకం వీటిపై ఉంటుందని కాంగ్రెస్ నేతలు ప్రకటించారు.

మహిళలపై వరాలు
మహిళలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు కాంగ్రెస్ నేతలు. రూ5వందలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామన్నారు.ప్రభుత్వ ఉద్యోగాల్లో 50శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు.ఒంటరి మహిళలకు నెలకు రూ.2వేలు ఇస్తామని తెలిపింది.వీటితో పాటు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ని అమలు చేస్తామని హామీ ఇచ్చింది. ఏడాదికి 10లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని తెలిపింది. కోవిడ్ పరిహారం నాలుగులక్షల రూపాయలు ఇస్తామని హామీ ఇఛ్చింది. ఇందిరా రసైయోజన కింద రూ8 కే ఆహారం అందిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది.

ఓట్లు రాలుతాయా?

కాంగ్రెస్ ఇచ్చిన హామీలు జనాల్ని ఆకట్టుకుంటాయా? ఒకవేల ఈ హామీలు ఓట్లుగా మారితే బీజేపీకి మైనస్ అవుతుంది. సహజంగా మేనిఫెస్టోలపై ప్రజలకు పెద్దగా నమ్మకం ఉండదు. అంతా ఎన్నికల గిమ్మిక్కేనని వారనుకుంటారు.చూడాలి గుజరాత్‌లో ఏం జరుగుతుందో.